ఐకాన్ స్టార్ సాలిడ్ సక్సెస్ తో మారుతీ ఎగ్జైటింగ్ రెస్పాన్స్.!

Published on Feb 5, 2022 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి నిన్నటితో 50 రోజుల మార్క్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 350 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను హిందీలో 100 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ను అందుకుంది అని సెన్సేషన్ ని నమోదు చేసింది.

మరి ఇలాంటి గ్రాండ్ సక్సెస్ ని అల్లు అర్జున్ అందుకోవడంతో మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతీ తన ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని బన్నీ ని కలిసి కంగ్రాట్యులేట్ చేసాక తెలిపారు. నా డియరెస్ట్ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఐకాన్ గా మారడం చాలా ఆనందంగా ఉందని.

పుష్ప ఈసారి అన్ని అవార్డ్స్ ని కూడా స్వీప్ చేస్తుందని అనుకుంటున్నానని, 100 కోట్లతో బాలీవుడ్ డెబ్యూ బన్నీ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని బన్నీ హార్డ్ వర్క్ ప్యాషన్ తో మరింత సాధించి మమ్మల్ని గర్వపడేలా చెయ్యాలని కోరుకుంటున్నానని మారుతీ తన ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :