కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది.. ప్రభాస్‌తో సినిమాపై మారుతీ క్లారిటీ..!

Published on Jan 22, 2022 8:51 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్దంగా ఉండగా, ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి. ఇవే కాకుండా మరో మూడు ప్రాజెక్టులను కూడా ప్రభాస్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతీతో ఒక సినిమా చేయనున్నాడని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ని కూడా ఈ సినిమాకి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే ప్రభాస్‌తో సినిమాపై వస్తున్న వార్తలపై దర్శకుడు మారుతీ తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చాడు. “నా భవిష్యత్ ప్రాజెక్ట్‌లు, టైటిల్స్, జానర్‌లు, సంగీత దర్శకులు మరియు సిబ్బంది మొదలైన వాటి గురించి వస్తున్న వార్తలు విన్నాను. కానీ కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది. మీ మద్దతు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండని ట్వీట్ చేశాడు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడా? లేదా? అనే విషయంలో మాత్రం మారుతీ పక్కా క్లారిటీ ఇవ్వలేదు. సో ఆయన చెప్పినట్టు కాలమే అన్నిటిని నిర్ణయిస్తుంది కనుక అప్పటివరకు వేచి చూడక తప్పదు మరీ.

సంబంధిత సమాచారం :