మారుతి సబ్జెక్ట్ కన్నడలోనూ సూపర్ హిట్ !

maruthi
యూత్ పల్స్ ను క్యాచ్ చేసి సినిమాలు తీయడంలో మాస్టర్ అనిపించుకున్న దర్శకుడు మారుతి తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రానికి కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ‘సుందరంగ జాన’ డిసెంబర్ 23న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తన సబ్జెక్టు కన్నడలోనూ విజయం సాధించినందుకు హ్యాపీగా ఫీలైన మారుతి తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ‘భలే భలే మగాడివోయ్ కన్నడ రీమేక్ సుందరంగ జాన మంచి సక్సెస్ సాధించింది. చాలా సంతోషంగా ఉంది. మంచి సబ్జెక్ట్ ఏ భాషలో అయినా సక్సెస్ సాదిస్తుంది’ అన్నారు.

అలాగే ‘ప్రేమ కథా చిత్రం కూడా తమిళ, కన్నడల్లో పెద్ద విజయం సాధించింది. ఇలాంటి విజయాలు భిన్నమైన కథలు రాయడానికి కావలసిన బలాన్నిస్తాయి’ అన్నారు. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ రీమేక్ చిత్రాన్ని రమేష్ అరవింద్ డైరెక్ట్ చేయగా గణేష్, శాన్వి హీరో హీరోయిన్లుగా నటించారు.