“బలగం” ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి – డైరెక్టర్ మారుతి

Published on Mar 31, 2023 10:30 pm IST


కమెడియన్ వేణు దర్శకుడి గా మారి తీసిన బలగం చిత్రం ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఓటిటి లో కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ బలగం చిత్రం పై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిన్న రాత్రి బలగం చూసాను. సినిమాలో తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలను వర్ణించిన తీరు చూసి నా మనసుకి హత్తుకుంది. సినిమా ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి. బలగం చిత్రానికి వేణు దర్శకత్వం వహించాడు అని తెలిసి చాలా సంతోషించాను. ప్రతిరోజూ పండగే చిత్రం సమయం లో నేను అనుభవించిన ఎమోషన్ ఇంపాక్ట్ ను గుర్తు చేసుకున్నందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో వేణు కి మంచి విజయం దక్కాలి అని కోరుకుంటున్నాను. అంతేకాక చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లు ప్రధాన పాత్రల్లో నటించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :