లూసీఫర్ లో లేని అంశం “గాడ్ ఫాదర్” లో ఉంది – డైరెక్టర్ జయం మోహన్ రాజా

Published on Oct 4, 2022 8:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ జయం మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గాడ్ ఫాదర్. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ చిత్రానికి అధికారిక రీమేక్. ఈ చిత్రం అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు డైరెక్టర్ జయం మోహన్ రాజా. లూసీఫర్ లో లేని అంశం గాడ్ ఫాదర్ లో ఉందని తెలిపారు. గాడ్ ఫాదర్ లో స్క్రీన్ ప్లే టైట్ గా, ఆసక్తికరం గా ఉంటుందనీ, ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మరొ పది పాత్రలు గెలుస్థాయి అని, అవి ఒరిజినల్ వెర్షన్ లూసీఫర్ లో చూడలేదు అని, చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని అన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ చిత్రం లో ఇప్పటికే సల్మాన్ ఖాన్ చేరిక తో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. సత్యదేవ్, పూరి జగన్నాథ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :