‘గాడ్ ఫాదర్ ‘ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్ మోహన్ రాజా

Published on Oct 4, 2022 2:21 am IST


మోహన్ రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలపై తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా గాడ్ ఫాదర్. ఇటీవల మలయాళం లో మోహన్ లాల్ హీరోగా విడుదలై సంచలన విజయం అందుకున్న లూసిఫర్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ లెవెల్లో పలుభాషలో రిలీజ్ చేస్తోంది యూనిట్. ఇక ఈ మూవీ గురించి నేడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాకు వెల్లడించారు దర్శకుడు మోహన్ రాజా. ఆయన మాట్లాడుతూ ఒరిజినల్ లూసిఫర్ వర్షన్ ని మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా ఒకింత కొద్దిపాటి మార్పులు చేయడం జరిగిందని, అలానే ఈ మూవీకి తాను ఫ్రెష్ గా స్క్రీన్ ప్లే రాశానని అన్నారు.

అలానే ఈ మూవీలో దాదాపుగా రెండు గంటల పైచిలుకు రన్ టైంలో మెగాస్టార్ కనిపిస్తారని ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండటంతో పాటు ఓవరాల్ సినిమా తప్పకుండా ఆడియన్స్ ను ఆకట్టుకుని మంచి సక్సెస్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోహన్ రాజా. తమన్ ఈ మూవీకి వండర్ఫుల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారని, హీరో మెగాస్టార్ చిరంజీవి, స్పెషల్ క్యారెక్టర్ చేసిన సల్మాన్ ఖాన్ తో పాటు ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ గాడ్ ఫాదర్ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.

సంబంధిత సమాచారం :