“సర్కారు వారి పాట” నా లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ – డైరెక్టర్ పరశురామ్

Published on May 19, 2022 2:17 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల హీరో మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక గా, తన ఫ్యాన్స్ కి, డైరెక్టర్ పరశురామ్ కు, చిత్ర యూనిట్ కి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

ఈ మేరకు మహేష్ చేసిన ట్వీట్ పై డైరెక్టర్ పరశురామ్ స్పందించారు. మీ నుండి విషెస్ రావడం చాలా స్పెషల్ మై హీరో అంటూ చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట నా లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని అన్నారు. ఈ ప్రయాణం లో మీరు నా పై చూపిన ప్రేమ, సంరక్షణ, నమ్మకం చెరగనిది, మళ్ళీ మీతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను, లవ్ యూ సార్ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ పరశురామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :