జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Apr 11, 2022 12:02 am IST

కేజీఎఫ్ చిత్రం తో సౌత్ లో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా ఎంతో హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్ర యూనిట్ అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ ను చేస్తూ, బిజీగా ఉంది.

ఈ మేరకు తాజాగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను గత 15 నుండి 20 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కి అభిమాని ను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మేము ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అంటూ చెప్పుకొచ్చారు. తను చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది అని, ఎంతో ఎగ్జైట్ గా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ సైతం ఈ చిత్రం తర్వాత మళ్ళీ ప్రభాస్ తో సలార్ షూటింగ్ లో బిజీగా ఉండనున్నారు. ఈ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు.

ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. కేజీఎఫ్ చిత్రం లో యశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :