కమల్ “విక్రమ్” పై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 11, 2022 4:30 pm IST

కేజీఎఫ్ సిరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ చిత్రం తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ డైరెక్టర్ యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ టీమ్ అందరికీ కూడా కంగ్రాట్స్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లను కలిసి చూడటం ఒక ఫీస్ట్ లాగా ఉంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజు, మీ వర్క్ కి నేను చాలా పెద్ద అడ్మైరర్ ను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మ్యూజిక్ అందించిన అనిరుద్ రవి చందర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

మీరొక రాక్ స్టార్ అంటూ అనిరుద్ రవి చందర్ ను కొనియాడారు. యాక్షన్ డైరెక్టర్లులు అయిన అంబ్ అరివ్ ల పట్ల గర్వం గా ఉందని, ఇలాంటి సక్సెస్ లు మరెన్నో దక్కాలి అంటూ చెప్పుకొచ్చారు. చివరగా సూర్య పాత్ర పై ప్రశంసలు గుప్పించారు. ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కమల్ హాసన్ విక్రమ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రస్తుతం అలరిస్తోంది. ఈ చిత్రం అటు థియేటర్ల లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :