ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇస్తున్న సలార్ టీమ్…ప్రశాంత్ నీల్ సరికొత్త పోస్ట్!

ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇస్తున్న సలార్ టీమ్…ప్రశాంత్ నీల్ సరికొత్త పోస్ట్!

Published on Oct 23, 2022 7:36 PM IST


పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు అతని చిత్రాలకు సంబందించిన వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా నిలుస్తోంది సలార్ టీమ్. ఈ చిత్రం నుండి నేడు వర్కింగ్ స్టిల్ తో పాటుగా, సలార్ ది సగా నుండి అద్దిరిపొయే స్టిల్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ మాస్ పోస్టర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

కొంత గ్యాప్ లోనే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరొక ఫోటో ను షేర్ చేశారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ లు ఇద్దరూ సలార్ సెట్స్ లో చిరు నవ్వులు చిందిస్తున్న ఫోటో. ప్రభాస్ ఈ ఫోటో లో మరింత కూల్ గా, సూపర్ గా ఉన్నారు. హ్యాపీ బర్త్ డే డార్లింగ్. మీకు ఈ సంవత్సరం చాలా గ్రేట్ గా ఉండాలని, ఈ సంవత్సరాన్ని మీకోసం ప్రత్యేకం గా రూపొందించడం లో మా వంతు ప్రయత్నం చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏదేమైనా సలార్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇస్తున్నాయి.

హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

https://twitter.com/prashanth_neel/status/1584167761332379648?t=f9cPwIt2gusOlGYevqBzyA&s=19

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు