ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో మరో గ్రాండ్ ప్రాజెక్ట్!

Published on Jun 10, 2022 2:00 am IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ప్రవీణ్ సత్తారు ఒకరు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ చిత్రం ను తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా జీ 5 తెలుగు ది ఫిల్మ్ రిపబ్లిక్ తో చేతులు కలిపి కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రణతి రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

ప్రొడక్షన్ నంబర్ 2 గా తెరకెక్కనున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన మిగతా వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పై డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :