రాధే శ్యామ్ లో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ పై డైరక్టర్ రాధా కృష్ణ కీలక వ్యాఖ్యలు!

Published on Dec 13, 2021 11:30 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు డైరక్టర్ రాధా కృష్ణ.

ఈ మేరకు హీరో ప్రభాస్ నటన గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాధే శ్యామ్ చిత్రానికి ప్రభాస్ నటన హైలైట్ గా నిలుస్తుంది అని అన్నారు. కళ్ళతో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో వేరే లెవెల్ లో యాక్టింగ్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అతనొక ఇంటెన్స్ యాక్టర్ అంటూ చెప్పుకొచ్చారు. రాధా కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ రాధే శ్యామ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :