ఇంకా పోస్టర్లు ఏంటి డార్లింగ్ – రాధా కృష్ణ కుమార్

Published on Feb 11, 2022 11:55 am IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ను మార్చ్ 11 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటల కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ను అభిమానులు సైతం ప్రమోట్ చేస్తున్నారు. సరికొత్త పోస్టర్ లను క్రియేట్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా ఒక అభిమాని డిజైన్ చేసిన పోస్టర్ ను అభినందిస్తూ రాధే శ్యామ్ చిత్రం డైరెక్టర్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అందుకు బదులుగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయొచ్చు కదా అంటూ అభిమానులు అడుగుతున్నారు. ఒక నెలలో రిలీజ్ పెట్టుకొని ఇంకా పోస్టర్స్ ఏంటి డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :