దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోగా రెండో సినిమా..!

Published on Oct 6, 2021 10:00 pm IST


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరును తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఏ సినిమా చేసినా, ఏ పాట చేసినా దాని కంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. కేవలం రొమాంటిక్ యాంగిల్‌లోనే కాకుండా, భక్తి చిత్రాలతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు రాఘవేంద్రరావు. అయితే ఈ దర్శకేంద్రుడు ‘పెళ్లి సందD’ సినిమాలో నటుడిగా తొలిసారి తెరపై కనిపించబోతున్నాడు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత రాఘవేంద్రరావు తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగతుండగానే, హీరోగా ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడు వీఎన్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో రాఘవేంద్రరావు వెంటనే ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. తనికెళ్ల భరణి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :