‘బ్యాక్ డోర్’ ట్రైలర్‌ని విడుదల చేసిన లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు..!

‘బ్యాక్ డోర్’ ట్రైలర్‌ని విడుదల చేసిన లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు..!

Published on Oct 27, 2021 10:00 AM IST

పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. తాజాగా “బ్యాక్ డోర్” చిత్రం ట్రైలర్‌ని లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కె.రాఘవేంద్రరావు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. “బ్యాక్ డోర్” టీజర్‌కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుందని, ఖచ్చితంగా దీనికి కూడా రెట్టింపు వ్యూస్ వస్తాయని అన్నారు.

దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. హీరో తేజ త్రిపురాన కూడా మాట్లాడుతూ లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు