హీరోలను మించిన క్రేజ్.. రాజమౌళికి భారీ కటౌట్..!

హీరోలను మించిన క్రేజ్.. రాజమౌళికి భారీ కటౌట్..!

Published on Mar 24, 2022 12:02 AM IST

సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల ముందు అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుండడం చూస్తుంటాం. కానీ బాహుబ‌లి సినిమాతో ఆ ట్రెండ్ మార్చేశాడు రాజమౌళి. స్టార్ హీరోలను మించి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. దీనికి నిదర్శనం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన రాజ‌మౌళి క‌టౌటే.

అవునండి బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్ వద్ద రాజమౌళి భారీ క‌టౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. ప్రస్తుతం ఈ భారీ కటౌట్ ఇపుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు