ఇది నేను కాదు, ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు – ఆర్జీవీ

Published on Mar 21, 2022 8:51 am IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి తన వివాదాస్పద ట్వీట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే, తాజాగా ఆర్జీవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆర్జీవీ ఒక మొక్కను నాటి దానికి నీళ్లు కూడా పోశాడు. ఈ సందర్భంగా ఓ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

ఈ ఫోటోతో పాటు ఎప్పటిలాగే తనదైన శైలిలో ఒక ట్వీట్ చేస్తూ.. ‘ఇది నేను కాదు, ఎందుకంటే నాకు మట్టి అన్నా, పచ్చదనం అన్నా అస్సలు నచ్చదు’ ఒక ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. అయితే, ఆర్జీవీ మెసేజ్ పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రిప్లై ఇస్తున్నారు. ‘ఇష్టం లేదంటూనే మొక్కలు నాటాల్సిన పరిస్థితి వచ్చిందా ఆర్జీవీ అని ఒకరు, ‘ఈ పచ్చదనమే లేకపోతే మన ఊపిరి ఆగిపోతుంది ఆర్జీవీ’ అని మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :