మెగాస్టార్ మాస్ ప్రాజెక్ట్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసేసిన దర్శకుడు?

Published on May 22, 2022 7:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా తాను నటించిన భారీ చిత్రం “ఆచార్య” అనుకున్న స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. దీనితో మిగతా సినిమాలపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే దేనికది దానిపై మంచి అంచనాలు ఉండగా వాటిలో దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) తో చేస్తున్న మాస్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.

అయితే సినిమాలో మళ్ళీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ తన మార్క్ మాస్ రోల్ ని ఫుల్ లెంగ్త్ లో చేస్తున్నారు. దీనితో మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ని దర్శకుడు బాబీనే ఓ మెగా ఫ్యాన్స్ మీటింగ్ లో ఆ సినిమా టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టు టాక్ నడుస్తుంది. గత కొన్ని రోజులు నుంచి కూడా ఈ సినిమాకి “వాల్తేర్ వీరయ్య” అని టైటిల్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టైటిల్ నే తాను కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇక దీనిపై ఒక మాస్ పోస్టర్ తో అధికారికంగా అనౌన్స్ అవ్వడమే బాకీ ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :