అందరికీ ఒక పరిష్కారం లభిస్తుంది అని అనుకుంటున్నా – ఆర్జీవీ

Published on Jan 10, 2022 8:02 pm IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టికెట్ ధరల అంశం పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు సినిమాటోగ్రఫి మంత్రి అయిన పేర్ని నాని తో ఆర్జీవీ భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ భేటీ లో ఐదు అంశాల పై చర్చించినట్లు ఆర్జీవీ తెలిపారు. టికెట్ రేట్లు తగ్గింపు నిర్ణయం ను వ్యతిరేకించా అని అన్నారు. ఎక్కడ ఎం జరుగుతుంది అనేది వివరించా, మంత్రి కూడా పలు అంశాలను చర్చించండం జరిగింది, వాటిని సినీ పరిశ్రమ కి చెందిన వారిని కలిసి చర్చిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుంది అని అనుకుంటున్నా అని అన్నారు. టికెట్ రేట్లు తగ్గిస్తే సినీ పరిశ్రమ కి చాలా నష్టం వస్తుంది అని, నా వాదన వినిపించడానికి మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం కి ఎలాంటి డిమాండ్లను పెట్టలేదు అంటూ స్పష్టం చేశారు.

అయితే దీని పై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం గా ప్రభుత్వం ఈ టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది అనే వాదన తో ఏకిభవించను అని అన్నారు. పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ సినిమాలను టార్గెట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అని నేను అనుకోవడం లేదు. ఒక్క చర్చ తో ఈ అంశం ముగిసి పోదు అని, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ తరపున రాలేదు, ఒక నిర్మాత గా వచ్చా, ఈ సమస్య పరిష్కారం అనేది సినీ పరిశ్రమ పై, ప్రభుత్వం పై ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం :