“పుష్పక విమానం” ట్రైలర్ పై అర్జున్ రెడ్డి డైరెక్టర్ కామెంట్స్

Published on Nov 11, 2021 8:30 pm IST

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం పుష్పక విమానం. విజయ్ దేవరకొండ సమర్పణ లో గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ పై అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రైలర్ చూసాను, చాలా ప్రామిసింగ్ గా ఉంది, మీరు చాలా బాగా చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నా అంటూ సందీప్ రెడ్డి అన్నారు. అంతేకాక చిత్ర నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలిపారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం కి బెస్ట్ విషెస్ అని అన్నారు. ఈ కామెంట్స్ చేస్తూ, ట్రైలర్ ను షేర్ చేశారు సందీప్ రెడ్డి. నవంబర్ 12 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :