రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” టికెట్స్ ధరల పై డైరక్టర్ క్లారిటీ!

Published on Jul 25, 2022 1:32 pm IST

మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శరత్ మండవ తన సినిమా టిక్కెట్ ధరల గురించి వెల్లడించారు.

తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు రూ.195గా ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఇక ఏపీకి వచ్చేసరికి సింగిల్ స్క్రీన్లలో ధరలు రూ.147 కాగా, మల్టీప్లెక్స్‌లలో రూ. 177 ఉన్నట్లు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ టిక్కెట్ ధరలు GSTతో సహా ఉండనున్నాయి. ఇవి ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులో ఉండే ధరలు మరియు సినిమాకు మంచి టాక్ వస్తే ప్రజలు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ తదితరులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. SLV సినిమాస్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా ఈ బిగ్గీని నిర్మించాయి, దీనికి సామ్ CS సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :