ఇది అలాంటి సినిమానే అవుతుంది…”ఊరికి ఉత్త‌రాన” డైరెక్టర్ సతీష్ కీలక వ్యాఖ్యలు!

Published on Nov 17, 2021 12:00 pm IST

నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఊరికి ఉత్తరాన. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్ మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సతీష్‌ అండ్‌ టీమ్‌ తెరకెక్కించిన ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్టి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్టి మాట్లాడుతూ, “భీమ్స్ నా శిష్యుడు. నిర్మాతను పిలిపించుకుని నేనే మాట్లాడాను. సినిమా అంటే ఎంత కష్టమో వివరించాను. విడుదల విషయంలోనూ ఇబ్బందులుంటాయని చెప్పాను. కొత్త నిర్మాతలు ఇలా రావాలి. ఏ సాయం చేసేందుకైనా నిర్మాతల మండలి అండగా ఉంటుంది” అని అన్నారు.

నిర్మాత వెంకటయ్య మాట్లాడుతూ, “మేం రైతులం. పొలం పనులు చేసుకుంటూ పిల్లలను పెంచాను. కష్టపడి చదివించాను. ఒకడిని ఆస్ట్రేలియా కూడా పంపించాను. ఇంకొకడు సినిమా తీస్తాను అన్నాడు. అప్పు తెచ్చి మరీ సినిమా తీశాం. అందరూ మమ్మల్ని విజయవంతం చేయాలి” అని అన్నారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ, “అనుకున్నది తీసేందుకు ఫ్రీడం ఇచ్చారు. వేరే భాషల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. మన దగ్గర రావట్లేదని అంటారు. ఇది అలాంటి సినిమానే అవుతుంది. చిన్న సినిమానే పది మందికి ఉపాధినిస్తుంది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కరోనా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను అందరూ చూడండి, సపోర్ట్ చేయండి” అని అన్నారు.

హీరోయిన్ దీపాళి శర్మ మాట్లాడుతూ, “ఇది నాకు మొదటి చిత్రం. మంచి పాత్రను పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. డీఓపీ గారు సినిమాను అందంగా చూపించారు. నా హీరో, నిర్మాత ఎంతో సహకరించారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇది సాధారణమైన ప్రేమ కథ కాదు. మిమ్మల్ని కచ్చితంగా డిజప్పాయింట్ చేయం. ఈ శుక్రవారం సినిమా విడుదల కాబోతోంది. మమల్ని ఆశీర్వదించండి” అని అన్నారు.

నరేన్ మాట్లాడుతూ, “ప్రతీ క్షణం నాతోనే ఉంటూ మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. మా నాన్నకు జీవితాంతం రుణ పడి ఉంటాను. సక్సెస్ మీట్‌ను మా నాన్న కోసం కచ్చితంగా వరంగల్‌లో ఏర్పాటు చేస్తాం. గెస్ట్‌గా వచ్చిన మోహన్ గారికి థ్యాంక్స్. ముందుగా ఓ కథ అనుకున్నాం. చాలా పద్దతిగా చేశాం. వారం రోజులు షూటింగ్ చేశాం. నా మీద వర్కవుట్ అయితే, ముందుకు వెళ్దామని అనుకున్నాం. స్క్రీన్ మీద బాగుందని అంతా అనుకున్నాం. ఎన్నో కష్టాలు పడి సినిమాను పూర్తి చేశాం. డైరెక్టర్ సతీష్, కెమెరామెన్ శ్రీకాంత్ ఇలా మేమంతా స్నేహితులం. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ నా రూమ్ మేట్. ఆయన మంచి సంగీతాన్ని అందించారు. అందరి గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను. మా సినిమా మీద మాకున్న నమ్మకంతోనే అలా మాట్లాడుతున్నాను.

మన ఇండస్ట్రీలో కొత్త వాళ్లు రావడం అనేది చాలా అరుదు. ఎంతో మంది దగ్గరకు వెళ్దామని అనుకున్నాను. ఎన్నో బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకులకు నవంబర్ 19న సమాధానం దొరుకుతుంది. కోటి రూపాయాలతో వరంగల్ సెట్ వేసి, 20 నిమిషాల సీన్స్ తీశాం. ఎంతో మంది కష్టపడ్డారు. కాంట్రవర్సీ చేసే వాళ్లందరికి కూడా నవంబర్ 19న సినిమా చూపిస్తాను. సినిమా అద్బుతంగా వచ్చింది. ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమాకు సెలెబ్రిటీలు లేరు. మీరే సెలెబ్రిటీలు. తిరుపతిలో వేదవతి రాయల్, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో రిసీవ్ చేసుకున్నారు. సోషల్ మీడియా లో అందరూ షేర్లు చేస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. మమ్మల్ని మీరు రిసీవ్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయం. కొత్త టీం అయినా కూడా ప్రయోగం చేశాం. సినిమా నవంబర్ 19న రాబోతోంది” అని అన్నారు.

సంబంధిత సమాచారం :