శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా ఇదేనా ?

‘ఫిదా’ సినిమా తరువాత శేఖర్ కమ్ముల చెయ్యబోయే సినిమాపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండతో ఈ డైరెక్టర్ సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల చెప్పిన లైన్ విజయ్ దేవరకొండకు నచ్చి డెవలప్ చెయ్యమని చెప్పారట. త్వరలో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రచారం బాగా జరుగుతోంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ అనే నూతన దర్శకుడితో మరియు పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫాంలోకి వచ్చిన ఈ హీరో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.