క్రియేటివ్ డైరక్టర్ శంకర్ ఇటీవల సైన్టిఫిక్ థ్రిల్లర్ ‘2.0’ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈచిత్రం విజయం సాధించింది. ఇక ఇప్పుడు శంకర్ మరో సై-ఫై థ్రిల్లర్ సబ్జెక్టు ఫై వర్క్ చేస్తున్నాడని సమాచారం. ఆయన సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈచిత్రం కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. అయితే త్వరలోనే ఈచిత్రం ఫై క్లారిటీ రానుంది.
ఇక శంకర్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ పనుల్లో బిజీ గా వున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ నటించనున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ పొల్లాచి లోఈనెల 18నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగనుంది.
భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.