శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మూవీ!

Published on Jun 7, 2023 11:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తను కమిట్ అయిన చిత్రాలు చేసి, మళ్ళీ రాజకీయాల్లో బిజీ కానున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, పవర్ స్టార్ కోసం ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వచ్చే ఏడాది ఎన్నికలు ముగియనున్నాయి. అనంతరం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే శంకర్, పవన్ కళ్యాణ్ కోసం పొలిటికల్ యాక్షన్ డ్రామా అయిన గేమ్ చేంజర్ ను ప్లాన్ చేయగా, దిల్ రాజు సూచన మేరకు రామ్ చరణ్ తో తీయడం జరిగింది. చూస్తుంటే, శంకర్ కచ్చితం గా పవర్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే ఆలోచన తో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :