‘గేమ్ ఛేంజ‌ర్’ పై శంక‌ర్ అప్డేట్

‘గేమ్ ఛేంజ‌ర్’ పై శంక‌ర్ అప్డేట్

Published on Jul 8, 2024 2:26 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాపై తాజాగా డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న ‘భార‌తీయుడు-2’ చిత్ర యూనిట్ తాజాగా మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఓ వ‌లేక‌రి ‘గేమ్ ఛేంజ‌ర్’ రిలీజ్ పై ప్ర‌శ్నించ‌గా.. శంక‌ర్ దీనికి సమాధానం ఇచ్చారు. రామ్ చ‌ర‌ణ్ పోర్ష‌న్ కు సంబంధించిన షూటింగ్ ముగిసింద‌ని.. ఇంకో 10-15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంద‌ని.. అది పూర్త‌వ్వ‌గానే, ఎడిటింగ్ వ‌ర్క్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఇక ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా ఈ సినిమాలో అంజ‌లి, శ్రీ‌కాంత్, ఎస్.జె.సూర్య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు