డైరెక్టర్ శంకర్‌కు మాతృవియోగం

Published on May 18, 2021 9:08 pm IST

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు తీరని లోటు ఏర్పడింది. ఆయన తల్లి ముత్తులక్ష్మి కమ్ముమూశారు. 88 ఏళ్ల వయసున్న ఆమె ఆరోగ్యపరమైన సమస్యలతో ఈరోజు చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు బుధవారం జరగనున్నాయి. శంకర్‌కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అనేక ఇంటర్వ్యూల్లో తల్లిని గుర్తుచేసుకున్న శంకర్ తాను ఈ స్థాయికి రావడానికి తల్లి ముత్తులక్ష్మి కారణమని, ఎన్నో కష్టాలుపడి ఆమె తనను పెంచారని గొప్పగా చెప్పేవారు.

ఈ సంగతి తెలిసిన అనేకమంది సినీ ప్రముఖులు శంకర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ అనేకమందిని కోల్పోయింది. ఇలాంటి తరుణంలో శంకర్ తల్లిని కోల్పోవడం మరింత బాధాకరం అంటున్నారు తమిళ సినీ పెద్దలు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ షూటింగ్ రీస్టార్ట్ చేసే పనిలో ఉన్న శంకర్ ఇటీవలే రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ సినిమాలను ఓకే చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :