లేటెస్ట్..”ఖుషి” ఫేక్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on May 24, 2022 8:57 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే స్టార్ హీరోయిన్ సమంత ల కాంబినేషన్ లో “ఖుషి” అనే ఒక క్లీన్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆల్రెడీ మేకర్స్ కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం వచ్చేసారు.

అయితే ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరూ హీరో హీరోయిన్ లు గాయపడ్డారని పలు వార్తలు బయటకి వచ్చి వైరల్ అవ్వసాగాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ ఒక క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ న్యూస్ అని వారు బాగానే ఉన్నట్టుగా తెలిపారు. దీనితో సమంత దేవరకొండ అభిమానులు ఈ క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హీషమ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :