సమంత క్లిక్ చేసిన ఫోటో ను షేర్ చేసిన “ఖుషీ” డైరెక్టర్!

Published on May 24, 2022 1:31 pm IST

ఫీల్ గుడ్ మూవీస్ ను తీసే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. వెన్నెల కిషోర్, విజయ్ దేవరకొండ, తను ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ బ్యూటిఫుల్ ఫోటో ను సమంత క్లిక్ చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక వెన్నెల కిషోర్, విజయ్ ల కామెడీ టైమింగ్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 23, 2022 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :