“మెగా 154” కోసం అన్ని ఎఫర్ట్స్ పెడతా..!

Published on Aug 2, 2022 7:10 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా దర్శకుడు బాబీ బర్త్ డే సందర్భంగా అనేక మంది ప్రముఖులు తనకి తన మెగా ప్రాజెక్ట్ కి విషెష్ తెలియజేయగా..

తాను అయితే అభిమానులకి ప్రమాణం చేస్తున్నారు. ఈ సినిమా కోసం నా మొత్తం ఎనర్జీ నా మొత్తం ఎఫర్ట్స్ పెడతానని ప్రామిస్ చేస్తున్నానని తెలిపారు. దీనితో ఇది మెగా ఫ్యాన్స్ కి కొత్త ఉత్సహాన్నిస్తుంది. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :