దూకుడు సినిమా పై డైరక్టర్ శ్రీను వైట్ల ఏమన్నారంటే?

Published on Sep 23, 2021 8:37 pm IST


మహేష్ బాబు కెరీర్ లో దూకుడు సినిమా సొంతం చేసుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదల అయి పదేళ్లు అవుతున్న సందర్భంగా సినిమా దర్శకుడు శ్రీను వైట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దూకుడు చట్టం కి దశాబ్దం గడిచింది అంటే నమ్మలేకున్నా అని అన్నారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో, వెలకట్టలేని మద్దతు తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయాన్ని సాధ్యం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా తన ప్రియమైన స్నేహితుడు అనిల్ సుంకర, రామ్ ఆచంట కి మరియు టీమ్ అందరికీ కూడా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల.

మరొక పక్క దూకుడు ఇండస్ట్రీ హిట్ గా పదేళ్లు అవ్వడం తో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా పలు చోట్ల ఈ సినిమా థియేటర్ల లో కొన్ని షోస్ వేయడం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :