శ్రీహరి కథతో మహేష్ బాబు

18th, October 2017 - 10:40:40 AM

మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భరత్ అను నేను’.కైరా అడ్వాణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ లో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు గతంలో ‘తకిట తకిట’ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహరి నాను ఈ సినిమాకి కథ ఇవ్వడం జరిగింది. కొరటాల శివ కు శ్రీహరి నాను చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ కథతో మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీమంతుడు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కనుక అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి, ప్రముఖ కెమెరామెన్ వి కె. చంద్రన్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.