మహేష్ బాబుతో సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల కంటే పెద్దదిగా ఉండబోతుంది – రాజమౌళి

Published on Mar 22, 2022 8:47 pm IST


రాజమౌళి ఈ నెల 25న విడుదల కానున్న తన కొత్త చిత్రం RRR ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు అన్ని ప్రముఖ మీడియా ఛానెల్‌ లకు వీడియో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ రోజు, అతను ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్‌ తో మాట్లాడుతూ, మహేష్ బాబుతో తన తదుపరి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మహేష్ బాబు తో సినిమా, బాహుబలి మరియు RRR కంటే పెద్దదిగా ఉండబోతోందని అన్నారు. రాజమౌళి చేసిన ఈ ప్రకటన వైరల్‌గా మారింది. మరియు మహేష్ అభిమానులను చాలా సంతోష పరిచింది. ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉంటుందని మరియు భారీ బడ్జెట్ తో రూపొందించబడుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు మహేష్ బాబు కోసం రాజమౌళి ఏ తరహా ప్లాన్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :