ఇంటర్వ్యూ : పర్ఫెక్షన్ కోసం ‘జనతా గ్యారేజ్’ సినిమా చూడమన్నారు – తాన్య హోప్
Published on Jul 13, 2017 1:37 pm IST


జగపతిబాబు ప్రధాన పాత్రలో దర్శకుడు వాసు పరిమి రూపొందించిన సినిమా ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిహాయమైన తాన్య హోప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. సినిమా రేపు విడుదలకానున్న సందర్బంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..

ప్ర) సినిమా ఎలా ఉంటుంది ?
జ) ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’ సినిమా ట్రైలర్ లో చూపినట్టు కేవలం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. హీరో వెనుక ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. సినిమాలో సప్రైజింగా ఉంటుందని ట్రెయిలర్లో ఎక్కడా దాన్ని రివీల్ చేయలేదు.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి ?
జ) ఇందులో నేను ఒక పోలీసాఫీసర్ గా నటించాను. చాలా యారొగెంట్ గా, అగ్రెసివ్ గా ఉంటుంది. మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం థ్రిల్లింగా ఉంది.

ప్ర) మీకు పటేల్ ఎస్.ఐ.ఆర్ కు కథలో లింకేంటి ?
జ) పటేల్ ఎస్.ఐ.ఆర్ చేసే హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాను. ఆలా చేసేప్పుడే ఆ హత్యల వెనకున్న కారణాలతో సినిమా కథ రివీల్ అవుతూ ఉంటుంది.

ప్ర) మీ పాత్రకు పాటలేమైనా ఉంటాయా ?
జ) సీరియస్, సిన్సియర్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కనుక నా పాత్రకు పాటలేం ఉండవు. అంతా హత్యల్ని ఛేదించడమే నా పని.

ప్ర) పాత్ర ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
జ) క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం దర్శకుడు వాసు పరిమి ‘జనతా గ్యారేజ్’ సినిమా చూడమని చెప్పారు. అందులో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ అందులో ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో అలానే చేయాలన్నారు. అందుకే రెఫరెన్స్ కోసం ఆ సినిమా చూశా.

ప్ర) జగపతిబాబుగారి నుండి ఏమైనా నేర్చుకున్నారా ?
జ) ఆయనకు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది. సన్నివేశాలని ఒక ఇంటెన్సిటీతో చేయడం ఎలాగో ఆయన నుండే నేర్చుకున్నాను.

ప్ర) భవిష్యత్తులో మీరు పాలిటిక్స్ లోకి వస్తారని విన్నాం ?
జ) అందులో తప్పేముంది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నాక రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. నాక్కూడా పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉంది.

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
జ) మాది బెంగళూరు. అక్కడే స్కూలింగ్ అయింది. కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదివాను. అందుకే పాలిటిక్స్ అంటే ఆసక్తి.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు హెల్ప్ అవుతుందా ?
జ) అవును. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్ కు హెల్ప్ అవుతుంది. ఇదొక మంచి సినిమా. నటిగా నాకు గుర్తింపునిస్తుందని అనుకుంటున్నాను.

 
Like us on Facebook