ప్రభాస్ సినిమాకి ఇంకాస్త టైమ్ అడుగుతున్న దర్శకుడు !

1st, January 2017 - 12:16:32 PM

sujeeth
‘బాహుబలి’ ఘన విజయంతో ప్రభాస్ స్థాయి నేషనల్ లెవల్ కి చేరిపోయింది. త్వరలో రిలీజ్ కాబోయే ‘బాహబలి -2’ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అలాగే ఇంత భారీ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ ఎలాంటి సినిమా తీస్తాడు, ఏ పెద్ద దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు అనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ కు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుజీత్ కూడా మరో ప్రాజెక్ట్ పెట్టుకోకుండా ప్రభాస్ సినిమా కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పై టైమ్ టు టైమ్ అప్డేట్స్ బయటకు రాకపోవడంతో అభిమానులు కొన్నాళ్లుగా అసహనం వ్యక్తం చేశారు.

దీంతో డైరెక్టర్ సుజీత్ కొద్దిసేపటి క్రితమే ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పదించారు. ‘ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాకు మంచి ఔట్ ఫుట్ ఇవ్వాలని నేను, మా టీమ్ కొన్నేళ్లుగా కష్టపడుతున్నాం. మీరెలాగు సపోర్ట్ చేస్తారని తెలుసు. దాంతో పాటే ఇంకాస్త ఓపిక, నమ్మకం ఉంచితే బాగుంటుంది. సినిమా మొదలయ్యాక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను’ అంటూ ప్రేక్షకులకు, అభిమానులకు తెలిపారు.