“చిత్తం మహారాణి” టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సుకుమార్

Published on Nov 14, 2021 1:30 pm IST

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేయడం జరిగింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి A కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హారి సంగీతం అందిస్తుండగా, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More