“పుష్ప2” కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్న సుకుమార్!

“పుష్ప2” కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్న సుకుమార్!

Published on Nov 16, 2022 11:22 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాక ఈ చిత్రం కి దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం సాధించిన ఘన విజయం తో జోరు మీద ఉన్న పుష్ప టీమ్, అంతకు మించి పుష్ప ది రూల్ ను ప్లాన్ చేస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ లో షురూ కానుంది. డైరెక్టర్ సుకుమార్ సినిమా కి బెస్ట్ ఇవ్వడం కోసం మరింత టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పుష్ప ది రూల్ 2023 లో కాకుండా 2024 మార్చ్ లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫజిల్, అజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు