మరో చిన్న సినిమాను నిర్మించబోతున్న ‘సుకుమార్’

4th, August 2016 - 08:16:52 PM

sukumar
ప్రస్తుతం టాలీవుడు లో పెద్ద దర్శకులు, నిర్మాతలు చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కథ బలంగా ఉంటే లో సినిమాలు తీస్తూ కొత్త దర్శకులకు, కొత్త నటీనటులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి వాళ్లలో ప్రముఖ దర్శకుడు ‘సుకుమార్’ ఒకరు. తన ఇమేజ్ కు తాను డైరెక్ట్ చేయడానికి వీల్లేని కథలను కొత్త దర్శకుల చేత డైరెక్ట్ చేయిస్తూ ఆ సినిమాలను తానే స్వయంగా నిర్మిస్తుంటాడు సుకుమార్.

గతంలో కొత్త దర్శకుడు ‘పల్నాటి సూర్య ప్రతాప్’ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ఈ దర్శకుడు మరో చైనా సినిమాకి నిర్మించనున్నాడు. ఈ సినిమాలో కూడా ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న ఓ యంగ్ హీరో నటించనున్నాడట. ఈ చిత్రంపై మరిన్ని వివరాలు ఇంకొన్నిరోజుల్లో తెలియనున్నాయి.