మెగా 154 షూటింగ్ సెట్స్ ను సందర్శించిన సుకుమార్!

Published on Jun 17, 2022 6:02 pm IST

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సెన్సేషనల్ మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అయితే తాజాగా దర్శకుడు సుకుమార్ మెగా154 సెట్స్‌ని సందర్శించారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబీ సుకుమార్‌కి ఏదో చూపించడాన్ని మనం ఫోటోలో చూడవచ్చు. మెగా 154 బాబీ చేతిలో బాగా రూపుదిద్దుకుంటోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :