తప్పులను, అవమానాలను మర్చిపోను – తేజ

Published on May 22, 2023 10:43 pm IST

విలక్షణ దర్శకుడు తేజ ముక్కుసూటి మనిషి. ఏ విషయాన్ని అయినా, ఆయన ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తేజ కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చింది. ఐతే, ఎన్ని ఇబ్బందులు పడినా తన తీరు మాత్రం మారదని చెప్పే తేజ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తేజ మాట్లాడుతూ .. “నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజానికి అసలు నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాంటప్పుడు నా గురించి ఎవరేమనుకుంటున్నారో నేనెందుకు తెలుసుకోవాలి అంటూ తేజ చెప్పుకొచ్చారు.

తేజ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నాలా ఉంటాను. అది తిక్కా అనుకుంటే నాకు సంబంధం లేదు. ఈ రోజు మీరు నన్ను తిట్టేసి మళ్లీ రేపు ఇంటర్వ్యూకి పిలిస్తే నేను వస్తానేమో. నాకు పెద్దగా గుర్తు ఉండదు. ఐతే, నేను నా హిట్స్ కంటే ఫ్లాపులను ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాను. అలాగే నేను చేసిన తప్పులను .. నేను పొందిన అవమానాలను కూడా నేను ఎప్పటికీ మర్చిపోను’ అని తేజ తెలిపారు.

సంబంధిత సమాచారం :