“RRR” హీరోస్ పై డైరెక్టర్ తేజ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“RRR” హీరోస్ పై డైరెక్టర్ తేజ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on May 28, 2023 2:00 PM IST

మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అయితే దగ్గుబాటి అభిరామ్ కి హీరోగా పరిచయం చేస్తూ “అహింస” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు వస్తున్నా సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అయితే తాను పలు ఇంటర్వ్యూస్ ఇస్తుండగా అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అయితే మన టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అయితే తనకి ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో అయితే ఒక యాక్టర్ గా రామ్ చరణ్ బాగా నచ్చాడు అని “రంగస్థలం” లో తన నటన చూసినప్పుడు నుంచి అతనంటే ఇష్టం ఏర్పడింది అని చెప్పారు. ఆ సినిమాలో చరణ్ నటన తన మ్యానరిజం లు బాగా చేసాడని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్టీఆర్ తో ఏదన్నా సినిమా చేయాలి అంటే ఎలాంటి సినిమా చేస్తారు అని అడగ్గా ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ అయితే నాకు లేదని మరింత ఆసక్తికర సమాధానం తారక్ పై అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు