ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో నిఖిల్ చేస్తున్న మూవీ ‘కిరాక్ పార్టీ’. కన్నడలో మంచి విజయం సాదించిన ‘కిరిక్ పార్టీ’కి ఈ సినిమా రీమేక్. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో నిఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.
ఈ రోజు ‘కిరాక్ పార్టీ’ సినిమా టీజింగ్ ట్రైలర్ ను దర్శకుడు తేజ విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యూత్ ఫుల్ గా ఉంది. కాలేజీ స్టూడెంట్స్, లవ్, ఫ్రెండ్ షిప్ వంటి అంశాలు ఈ సినిమాలో బాగా చూపించినట్లు అనిపిస్తోంది. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదాపడింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు నిర్మాతలు.
