ఆ సినిమా చూసే సుశాంత్‌ని అలవైకుంఠపురంలోకి తీసుకున్నా – త్రివిక్రమ్

Published on Aug 25, 2021 3:00 am IST

సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27న విడుదల కాబోతుంది. అయితే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాన్ అతిధిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్ ముందుగా సంతోషించదగ్గ విషయమేమిటంటే ప్రపంచం మొత్తానికి థియేటర్‌కి రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమేనని, భయపడక్కర్లేదు మంచి కంటెంట్‌తో సినిమాలు చేద్దాం, మరింత ముందుకెళ్దామని అన్నారు. ఇకపోతే ఈ సినిమా చేస్తున్నట్టు సుశాంత్ నాకు “అల వైకుంఠపురములో” సినిమా చేస్తున్నప్పుడే చెప్పాడని, అప్పటి నుంచి నేను కూడా బయట వింటున్నాను ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అని అన్నారు. సుశాంత్ ఏదో అనవసరంగా ఓ చట్రంలో ఇరుక్కుపోయాడని తనకు అనిపించేదని, కొన్ని సార్లు లెక్కలు తప్పుతుంటాయని అన్నారు.

అయితే “చి.ల.సౌ” సినిమాతో హిట్‌తో సుశాంత్ తానేంటో నిరూపించుకున్నాడని, ఆ సినిమా చూసే నేను “అలవైకుంఠపురం” సినిమాలో నటించమని సుశాంత్‌ని అడిగానని త్రివిక్రమ్ అన్నాడు. అయితే ఇప్పుడు “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమా ద్వారా హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడని అన్నారు. అయితే ఆగష్టు 27వ తేదిన థియేటర్లకు అందరూ 100, 150 చలాన్లు కట్టించడని, ప్రొడ్యూసర్‌తో కూడా గవర్నమెంట్‌కి బోలెడంత ట్యాక్స్ కట్టిద్దామని అన్నారు.

దర్శకుడు ఎస్.దర్శన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని, ముందుగా అతడికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నాడు. డు అభినవ్ గోమఠం తన ఫెవరెట్ యాక్టర్ అని అన్నారు. చిత్ర బృందానికి తన నుంచి విషెష్ తెలియచేస్తున్నట్టు చెప్పాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :