“అశోక వనంలో అర్జున కళ్యాణం” కోసం సింగర్ గా మారిన డైరెక్టర్

Published on Mar 30, 2022 2:00 pm IST


యువ నటుడు విశ్వక్ సేన్ తదుపరి చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు, మేకర్స్ తదుపరి పాట వివరాలను వెల్లడించారు. రెండు ఎనర్జిటిక్ పాటలను విడుదల చేసిన తర్వాత, మేకర్స్ పెప్పీ ట్రాక్‌ తో కూడిన బ్రేక్ అప్ సాంగ్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేసారు.

ఈ పాటను ప్రకటించేందుకు విశ్వక్ సేన్ మరియు సినిమా రచయిత రవికిరణ్ కోలాతో కూడిన ఫన్నీ ప్రోమోను బృందం ఆవిష్కరించింది. రాంసిలక అనే టైటిల్ తో ఈ పాటను రేపు విడుదల చేయనున్నారు. రవికిరణ్ కోలా స్వరాలు సమకూర్చడంతో పాటు పాట కూడా పాడారు. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి మరియు సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా ఏప్రిల్ 22, 2022న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :