“మెరిసే మెరిసే” టీమ్ కు ఆల్ ది బెస్ట్ – వి.వి.వినాయక్

Published on Aug 5, 2021 12:40 pm IST

హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన తాజా చిత్రం మెరిసే మెరిసే. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకం పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూసిన వి.వి.వినాయ‌క్ చిత్ర యూనిట్ ను అభినందించారు.

ఈ నేపథ్యం లో వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ, డైరెక్ట‌ర్ ప‌వ‌న్ రాజ‌మండ్రి కుర్రాడు అని, తన నాన్న‌గారి స్నేహితుడు సుబ్బ‌రాజుగారి అబ్బాయి అయిన ప‌వ‌న్ మెరిసే మెరిసే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ప‌వ‌న్‌కు చాలా మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు. అలాగే హుషారు చిత్రంలో న‌టించిన దినేశ్ హీరోగా న‌టించాడని, ఈ సినిమాకు ప‌నిచేసిన యూనిట్‌లో చాలా మంది రీసెంట్ సినిమాల్లో ప‌నిచేసిన‌వారే నని తెలిపారు. ఓ మంచి టీమ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కె మాట్లాడుతూ, సినిమా ఆగ‌స్ట్ 6న విడుద‌ల‌వుతుందని, సినిమా ట్రైల‌ర్ చూసి మా టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసిన స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌ గారి పెద్ద మ‌న‌సుకు ధ‌న్య‌వాదాలు అంటూ చెప్పుకొచ్చారు. మంచి ప్ర‌య‌త్నం చేశామని, యుక్త‌వ‌య‌సులోని అమ్మాయి, అబ్బాయిల మ‌న‌సులు సునిశితంగా ఉంటాయని, అలాంటివారు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారని, ఎలా స‌క్సెస్ అయ్యార‌నే క‌థాంశంతో ఈ సినిమా రూపొందిందని అన్నారు. క‌చ్చితంగా అందిర‌కీ ఈ సినిమా న‌చ్చుతుందని, మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నామని అన్నారు.

హీరో దినేశ్ తేజ్ మాట్లాడుతూ, కోవిడ్ స‌మ‌యంలో చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసి సినిమాను విడుద‌ల చేస్తున్నామని అన్నారు. ఇండ‌స్ట్రీ నుంచి చ‌క్క‌టి మ‌ద్ద‌తు ల‌భించిందని, వినాయ‌క్ వంటి పెద్ద డైరెక్ట‌ర్ మా యూనిట్‌ను అభినందించ‌డ‌మే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌ అని అన్నారు. మెరిసే మెరిసే చ‌క్క‌టి మూవీ, ప్లెజంట్ గా ఉంటుంది, థియేటర్ లలో చూసి ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :