కోలీవుడ్‌లో తన సత్తా నిరూపించుకున్న వంశీ పైడిపల్లి

Published on Jan 21, 2023 3:03 am IST


జాతీయ అవార్డ్ విన్నింగ్ చిత్రం మహర్షి విడుదల తర్వాత, టాలీవుడ్ ప్రేక్షకులు వంశీ పైడిపల్లి తదుపరి తెలుగు చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆశ్చర్యకరంగా వంశీ, తన తొలి తమిళ చిత్రాన్ని స్టార్ హీరో విజయ్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు, దాని ఫలితమే వరిసు. ఈ భారీ చిత్రంతో వంశీ పైడిపల్లి తమిళ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నాడు. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిన తొలి టాలీవుడ్ దర్శకుడు గా వంశీ పైడిపల్లి నిలిచాడు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా దర్శకుడు మరిన్ని సినిమాలు చేయాలని తమిళ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడి తదుపరి సినిమా గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన తదుపరి సినిమా గురించి తెలియాలంటే మనం మరికొంత కాలం ఆగాల్సిందే. సంక్రాతి స్పెషల్ గా రిలీజ్ అయిన వరిసు విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అన్ని చోట్లా విజయవంతంగా రన్ అవుతోంది.

ఈ వారం పెద్దగా చిత్రాలు రిలీజ్ లు ఏమీ లేకపోవడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన వసూళ్లను కొనసాగిస్తుంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :