కస్టడీ టీజర్ పై డైరెక్టర్ వెంకట్ ప్రభు లేటెస్ట్ పోస్ట్!

Published on Mar 3, 2023 12:34 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై డైరెక్టర్ వెంకట్ ప్రభు పలు వ్యాఖ్యలు చేశారు. డియర్ చై ఫ్యాన్స్, మీ ఎగ్జైట్ మెంట్ ను పూర్తిగా అర్దం చేసుకున్నాం. కస్టడీ టీజర్ కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలో టీజర్ విడుదల డేట్ ను వెల్లడిస్తాం అని అన్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం లో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ జీ, అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మే 12, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :