యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్ !

Published on Mar 6, 2023 11:47 pm IST

‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా భారీ యాక్షన్ చిత్రం ‘కేజీఎఫ్’ పై ఇన్ డైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేజీఎఫ్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ను ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. ఒక తల్లి.. ‘నువ్వు గొప్పోడివి అవ్వాలరా’ అంటుంది. బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడాలని దానికి అర్థం. కానీ, తల్లి అంత కావాలి (చేతులతో చూపిస్తూ) అని అంటుంది. హీరో వెళ్లి ఆ వస్తువును తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. ఒక పాట వస్తుంది. చివరకు వాడు మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాడు. ఆ మహా తల్లి నిజంగా ఉండి ఉంటే.. నాకు కలవాలని ఉంది.

వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా ?, ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే వాడు.. బంగారాన్ని అంతా ఎక్కడో పారదొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే.. అలాంటి కథను సినిమాగా తీస్తే.. మనం చప్పట్లు కొట్టి చూస్తున్నాం’’ అంటూ వెంకటేశ్ మహా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వెంకటేశ్ మహా చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత సమాచారం :