మొదటిది ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది – వెంకీ కుడుముల

Published on Feb 2, 2022 3:00 pm IST


దర్శకుడు వెంకీ కుడుముల తీసిన తోలి చిత్రం ఛలో విడుదల అయ్యి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యం లో డైరెక్టర్ వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేశారు. మొదటిది ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేశారు. ఈ జర్నీ విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ తెలిపారు. ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ చెప్పుకొచ్చారు.

నాగ శౌర్య మరియు రష్మిక మందన్న హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి మహత స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమాను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :