రవితేజతో ఫిక్స్ అయిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?

రవితేజతో ఫిక్స్ అయిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?

Published on Aug 2, 2021 10:19 AM IST

భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల హీరో రవితేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసి కథను చెప్పాడని, రవితేజ కి కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మంచి క్రేజ్ ఉంటుంది.

మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. అయితే వెంకటేష్ కి కూడా వెంకీ కుడుముల ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో వెంకీతో ప్రాజెక్ట్ పట్ల వెంకటేష్ కూడా సానుకూలంగా ఉన్నాడని ఆ మధ్య వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది. రవితేజతో సినిమాకి వెంకీ కుడుముల ప్లాన్ చేసుకుంటున్నాడు. భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు